![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:00 PM
హర్యానాలోని ఫరీదాబాద్‌లో వైద్యరంగంలోనే అత్యంత దారుణమైన మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. కేవలం ఎంబీబీఎస్ డిగ్రీ మాత్రమే ఉన్న ఒక వైద్యుడు ఏకంగా కార్డియాలజిస్ట్‌గా నటిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో 50కి పైగా గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఫరీదాబాద్‌లోని బాద్‌షా ఖాన్ సివిల్ ఆసుపత్రిలో డాక్టర్ పంకజ్ మోహన్ శర్మ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. సుమారు ఎనిమిది నెలలకు పైగా కార్డియాలజిస్ట్‌గా చలామణి అవుతూ గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించాడు. వాస్తవానికి అతడికి ఎంబీబీఎస్ పట్టా మాత్రమే ఉంది. గుండె వంటి కీలకమైన అవయవాలకు సంబంధించిన సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయడానికి అతనికి ఎలాంటి అధికారిక అర్హత లేదని పోలీసులు స్పష్టం చేశారు.ఈ నకిలీ వైద్యుడు, ప్రస్తుతం ప్రాక్టీస్‌లో ఉన్న మరో నిజమైన కార్డియాలజిస్ట్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించి ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అతడితో సర్జరీ చేయించుకున్న అనేక మంది రోగులు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని, వారిలో కొందరు మరణించినట్లు కూడా సమాచారం.
Latest News