![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 05:56 PM
రాష్ట్రంలో పొగాకు పండించిన రైతుల గోడు వర్ణనాతీతంగా ఉందని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..... కొనుగోలు చేసే వారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెడుతున్నారని వెల్లడించారు. ఒక్క పొగాకే కాకుండా రాష్ట్రంలో కోకో, మామిడి, మిర్చి ఇలా ఏ పంట చూసినా రైతుల కష్టాలను ఆదుకునే వారే కనిపించడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండుగ అనే రీతిలోనే సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు.
Latest News