![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 02:08 PM
బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల వేళ చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతి చెందిన ఘటనను బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వేడుకల నిర్వహణకు మార్గదర్శకాల జారీకి ఆలోచన చేస్తోంది. ‘మేం మౌనంగా చూస్తూ ఉండలేం. ఇది ఆర్సీబీకి సంబంధించిన ప్రైవేట్ వ్యవహారమే కానీ, ఈ దేశంలో క్రికెట్ వ్యవహారాలకు మేం బాధ్యత తీసుకోవాల్సిందే’ అని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా తెలిపారు.
Latest News