|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 11:16 AM
శాతవాహన కళాశాల యాజమాన్యం ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కళాశాల భవనాల్ని కూల్చివేసిన ఘటనలో బోయపాటి శ్రీకృష్ణ పై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర డిమాండ్ చేశారు. ముందస్తు భవనాల కూల్చివేతలపై వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం చుట్టుగుంటలోని శాతవాహన కళాశాలలో ధర్నా నిర్వహించారు. కూల్చేసిన శిధిల భవనాల్ని పరీశీలించారు. ఈ సందర్భంగా యాజమాన్యంకి ఒత్తాసు పలికిన కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాసరావు ని అడ్డుకున్నారు. విద్యార్థి నేతలకు, ప్రిన్సిపాల్ కి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర మాట్లాడుతూ.. సుమారు ఐదు దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన శాతవాహన కళాశాల భవనాల్ని అక్రమంగా కూల్చివేసి విద్యార్థులకి తీవ్ర అన్యాయం చేసారని మండిపడ్డారు. శాతవాహన కళాశాల హక్కుదారుడిగా బోయపాటి శ్రీనివాస అప్పారావుకి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. భవనాలు కూల్చివేయాలని తీర్పులో లేదన్నారు. పోలీసులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా భవనాలు కూల్చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన ఈ సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వలేదన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా కిడ్నాప్ చేసి సంతకం చేపించుకున్నప్పుడు కళాశాల విద్యార్థులు, స్టాప్ చాలా నష్ట పోతారని గగ్గోలు పెట్టిన ప్రిన్స్ పాల్ వంకాయలపాటి శ్రీనివాసరావు భవనాల కూల్చివేతపై మౌనం వహించడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.
Latest News