|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 10:53 AM
ఏపీలో రక్షించాల్సిన వ్యవస్థలే నైతికతను కోల్పోతున్నాయని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. యలమంద మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై బాధితురాలికి అండగా ఉంటే తనపై ఫోక్సో కేసును పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా చెవిరెడ్డి తెలిపారు. తమతో తప్పుడు కేసులు పెట్టించారని బాధితులే చెప్పారని, తనను లిక్కర్ కేసులో ఇరికించాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు. గన్‌మెన్‌తో బలవంతంగా స్టేట్‌మెంట్ తీసుకున్నారని, తనను అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వ పెద్దల కళ్లు చల్లబడతాయనుకుంటే అందుకు తాను సిద్ధమేనన్నారు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. తప్పుడు స్టేట్‌మెంట్ రిట్ పిటిషన్ వేస్తానన్నారు చెవిరెడ్డి. ప్రస్తుతం అధికారంలో ఉన్న మీరు.. తన కింద సిబ్బందిని ఎందుకు వేధిస్తున్నారన్నారు.
Latest News