|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 10:50 AM
పదవ తరగతి జవాబు పత్రాల వాల్యుయేషన్‌లో అవకతవకల వల్ల విద్యార్థులకు కలిగిన అసౌకర్యం, నష్టంపై వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం పోరు బాట పట్టింది. ఈ మేరకు వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నేతృత్వంలో శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, ఆ విభాగం ప్రతినిధులు జిల్లా విద్యాధికారులకు వినతి పత్రం సమర్పించారు. కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను ఎలాంటి ఫీజు లేకుండా రీవాల్యుయేషన్ చేయాలని, తుది ఫలితాలు వచ్చేంత వరకు టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లు కొన్నాళ్లు నిలిపి వేయాలని, పేపర్ల మూల్యాంకంలో తప్పులకు బాధ్యులైన అందరిపై చర్యలు తీసుకోవాలని, మొత్తం ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైయస్సార్‌సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ప్రతినిధులు తమ జిల్లాల్లో విద్యా శాఖ అధికారులకు అందజేశారు.
Latest News