|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:18 PM
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రంపచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య స్నేహం ఇన్నాళ్లూ బాగానే ఉంది. ముఖ్యంగా మస్క్ డోజ్ అధినేతగా ఉన్నన్ని రోజులు వీరిద్దరూ ప్రాణ స్నేహితుల్లా మెలిగారు. కానీ మస్క్ పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు బయట పడుతున్నాయి. ఇప్పటికే మస్క్ రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును వ్యతిరేకించడంతో ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా దానిపై మస్క్ స్పందించారు. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని అంటూనే.. తన వల్లే ఆయన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారని పేర్కొన్నారు. తాను లేకపోపోయి ఉంటే ట్రంప్ కచ్చితంగా ఓడిపోయే వారని వివరించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే ట్రంప్ ఓ సభలో మాట్లాడుతూ.. మస్క్ రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసుండేది కాదన్నారు. మస్క్ కామెంట్లకు తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. దీనికి మస్క్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టి మరీ తన వ్యతిరేకను వెల్లడించారు. ట్రంప్ నాకు సాయం చేసినట్లు చెప్పడం పూర్తి అబద్ధం అని వ్యాఖ్యానించారు. తనకు, తన కంపెనీలకు ఆయన పాలన కాలంలో ఎదురైన కఠినమైన పరిస్థితులను ఎవరూ మర్చిపోలేరని గుర్తు చేశారు.
ముఖ్యంగా తన మద్దతు లేకపోతే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోయేవారని మస్క్ చెప్పుకొచ్చారు. తాను లేకుంటే కచ్చితంగా ట్రంప్ ఓడిపోయి ఉండేవారని పేర్కొన్నారు. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారని అన్నారు. సెనెట్‌లో రిపబ్లికన్లు 51-49తో ఉండేవారని గురువారం రోజు వెల్లడించారు. అంతేకాకుండా ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవికి రావడం అమెరికాకు మంచిది కాదఅని తీవ్ర కామెంట్లు చేశారు. అయితే దీనికి ముందే ట్రంప్.. మస్క్ గురించి మాట్లాడారు.
రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యానని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే శ్వేతసౌధంలో తన స్నేహితుడు లేకపోవడం విచారం అని పేర్కొన్నారు. దీని తర్వాత మస్క్ చేసిన వరుస ట్వీట్లు చూసిన ట్రంప్.. షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా మస్క్ లేకుంటే తాను ఓడిపోయే వాడినంటూ చేసిన కామెంట్లపై స్పందించారు. తాను ఎన్నకల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని.. ఆయన లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని అన్నారు. దీని తర్వాత మళ్లీ మస్క్ ట్వీట్లు చేశారు. కొత్త పార్టీ పెట్టొచ్చా అని, 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సరైన సమయమేనా అంటూ అడిగారు.
Latest News