|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:07 PM
జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలో జరగనున్న జీ7 (G7) సదస్సులో పాల్గొనాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. ఈ మేరకు కెనడా ప్రధాని మార్క్ కార్న్ స్వయంగా మోదీకి ఫోన్ చేసి, సదస్సులో హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఆహ్వానం పలికిన కెనడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇటీవల కెనడా ప్రధానిగా ఎన్నికైన మార్క్ కార్న్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల జీ7 సదస్సుకు మోదీకి ఆహ్వానం అందలేదని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా పరిణామాలతో ఆ విమర్శలకు సమాధానం లభించినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.