|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:08 PM
ఉలవలు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. వీటిలో ఉండే అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బరువు తగ్గడానికి, మధుమేహ నియంత్రణకు ఉలవలు ఉపయోగపడతాయి.
Latest News