|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:30 PM
ప్రపంచంలోనే ఎత్తయిన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. 359 మీటర్ల ఎత్తులో 1,315 మీటర్ల పొడవుతో ఈ వంతెన నిర్మితమైంది. ఇది జమ్మూ, శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని పెంచనుంది. ఈ చినాబ్ రైలు వంతెనను ప్రధాని మోదీ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. ఇక ఇదే వంతెనపై నుంచి వెళ్లే కట్రా – శ్రీనగర్ వందే భారత్ రైలును కూడా పచ్చజెండా ఊపి ప్రారంభించారు ప్రధాని. జమ్మూ ప్రాంతంలోని కట్రా రైల్వే స్టేషన్‌కు ప్రధాని రాక సందర్భంగా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో పకడ్భంది ఏర్పాట్లను చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత, జమ్మూకశ్మీర్‌కు మోదీ వెళ్లడం ఇదే మొదటిసారి.
Latest News