|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:04 PM
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలకా్ట్రనిక్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటమనేని భాస్కర్ అన్నారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీం (ఈసీఎంఎస్), ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ ముసాయిదా, పెట్టుబడుల ప్రమోషన్ వర్క్‌షా్‌పలో ఆయన మాట్లాడారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం పాలసీకన్నా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెరుగైన రాయితీలు, సదుపాయలు అందించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ వర్క్‌షాప్ నిర్వహించామన్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎలకా్ట్రనిక్ కాంపోనెంట్స్‌ను మన రాష్ట్రంలో తయారు చేసేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. 25 శాతం ఆ యూనిట్లను దక్షిణ రాయలసీమలో నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. ఇప్పటికే శ్రీసిటీలో 200కుపైగా పరిశ్రమలు ఉన్నాయని వివరించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామన్నారు. అంతకుముందు కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి సుశీల్‌పాల్ మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కోసం భారత ప్రభుత్వం పీఎల్‌ఐ, ఇతర ఇన్సెంటివ్స్ అందజేస్తోందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు తీసుకొస్తున్న పాలసీలు అమోఘమని పలువురు పారిశ్రామిక వేత్తలు కొనియాడారు.
Latest News