|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:01 PM
విజయవాడ నగరంలోని శాతవాహన కాలేజ్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా కాలేజీని నేలమట్టం చేశారు. విజయవాడ నడిబొడ్డున విశాలాంధ్ర రోడ్డులోని శ్రీదుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన శాతవాహన కాలేజీ ఉంది. ఈ కాలేజీ స్థలం తమదేనంటూ బోయపాటి అప్పారావు బోర్డులు పాతారు. ఈ వివాదం నేపథ్యంలోనే.. ఇటీవల కాలేజీ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో.. శ్రీనివాస్‌ను నిందితులు వదిలేశారు. ఇప్పుడు బోయపాటి అప్పారావు తన అనుచరులతో వచ్చి కాలేజీనే కూలగొట్టించారు. బుల్డోజర్ల సహాయంతో కాలేజీ బిల్డింగ్‌లను నేలమట్టం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకుని, బుల్డోజర్లను స్వాధీనం చేసుకున్నారు.
Latest News