|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 12:24 PM
పదవ తరగతి మూల్యాంకనంలో జరిగిన లోపాలకు విద్యా శాఖ మంత్రి లోకేష్ కారణమని, తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. పదో తరగతి మూల్యాంకనంలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళగిరిలోని విద్యా భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్ధి నేతలపై మంగళగిరి పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని.. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజుల పాటు నిలిపివేయాలని.. బాధ్యులైన అందరిపైనా చర్యలు చేపట్టాలని కోరుతూ పాఠశాల విద్యా డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డికి వైయస్ఆర్‌సీపీ స్టూడెంట్స్ వింగ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు.
Latest News