|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 12:29 PM
కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రేమ, అభిమానాన్ని అక్రమ కేసులు, అరెస్టులతో అడ్డుకోలేరని కూటమి నేతలను కాకాణి కూతురు, వైయస్ఆర్‌సీపీ నాయకురాలు కాకాణి పూజితారెడ్డి హెచ్చరించారు. గురువారం నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.... వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 4 వ తేదీ సర్వేపల్లిలో నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి ప్రతి గ్రామంలోని వాడ వాడల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అరకొరగా పథకాలు అందిస్తూ, ప్రజలను మభ్యపెడుతున్నారు.కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ప్రజలు నిరసన తెలియజేశారు. వైయస్ జగన్ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంతో పాటు శాంతిభద్రతలు ఎక్కడా క్షీణించకుండా సుపరిపాలనను అందించారు. కూటమి ప్రభుత్వంలో రెడ్‌బుక్ రాజ్యమేలుతోంది. ప్రశ్నించిన వారి గొంతు అక్రమ కేసులతో నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు పరిధి దాటి ప్రజలపై నియంతలా ప్రవర్తిస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం. కూటమి ప్రభుత్వం ప్రజలపై ఒక నియంతలా వ్యవహరిస్తుంది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు.నాయకులు, ప్రజల సమస్యల గురించి మాట్లాడకూడదు అనే విధంగా వీరి వ్యవహారం ఉంది అని మండిపడ్డారు.
Latest News