|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 12:12 PM
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆర్థిక వృద్ధిని పెంపొందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడోసారి రెపో రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాజా monetary policy సమీక్షలో రెపోరేట్‌ను 50 బేసిస్ పాయింట్లు (0.50 శాతం) తగ్గిస్తూ, 6 శాతం నుండి 5.5 శాతానికి పరిమితం చేసింది. ఈ నిర్ణయంతో గృహ రుణాలు, వాహన రుణాలు, పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా వాటి ఇఎంఐలు (EMI) కూడా తగ్గుతాయి. ముఖ్యంగా హౌసింగ్ లోన్లపై దీని ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. రియల్ ఎస్టేట్ రంగానికి ఇది ఊపునిస్తుంది అనే అంచనాలు ఉన్నాయి.
ఎందుకు తగ్గించింది?
ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగమనం, వినియోగదారుల వ్యయాల్లో తగ్గుదల, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం నేపథ్యంలో, వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా పెట్టుబడులు, వినియోగం పెరగాలని RBI ఆశిస్తోంది.