|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 11:54 AM
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట కేసును సిఎం సిద్ధరామయ్య CIDకి అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్డ్ జస్టిస్ మైఖేల్ డికున్హా నేతృత్వంలోని న్యాయ విచారణకు ఆదేశించారు. కెఎస్‌సిఎ, ఆర్‌సిబి, డిఎన్‌ఎ నిర్వహణపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే, డిఎన్‌ఎ సిబ్బంది సునీల్ మాథ్యూ, కిరణ్ సహా నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. వేల మంది అభిమానులు గేటు బద్దలు కొట్టి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు.
Latest News