|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 12:35 PM
గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి మళ్లీ దేశంలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో, ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి.ఈ క్రమంలో మహారాష్ట్రలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ప్రస్తుతం మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 200కు పైగా నమోదు అయినట్టుగా తెలుస్తుంది.మొత్తం మహారాష్ట్రలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 209 గా ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా పూణేలో 35 కేసులు నమోదు కాగా, ముంబైలో ఎనిమిది కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు జనవరి నెల నుంచి మహారాష్ట్రలో 300 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.అయితే జనవరి నెల నుంచి నమోదైన కరోనా కేసుల వివరాలను చూస్తే జనవరి, ఫిబ్రవరి నెలలలో ఒక్కో కేసు నమోదు కాగా, మార్చి నెలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు . మే నెలలో నాలుగు కేసులు నమోదు కాగా అత్యధికంగా మే నెలలో 252 కేసులు నమోదయ్యాయి. ఒక్క మే నెలలోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం గమనార్హం.అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కారణంగా నాలుగు మరణాలు సంభవించాయి. కాగా తాజాగా మహారాష్ట్ర దానిలో కోవిడ్ తో 21 సంవత్సరాల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా దేశంలో కరోనా కేసులలో కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. కేరళలో మే నెలలో 278 కరోనా యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు తమిళనాడులో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.బెంగళూరులో కరోనా సంబంధిత మరణం ఒకటి నమోదయింది. 84 సంవత్సరాల వృద్ధుడు కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందాడు.భారతదేశంలో కరోనా వైరస్ వైరస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళనను కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ NB 1.8.1, LF.7 సబ్ వేరియంట్లను వేరియంట్స్ అండర్ మానిటరింగ్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది.
Latest News