|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 12:23 PM
AP: రాష్ట్రంలో సినీరంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకోవడానికి తాము సిద్ధమని గతంలో ఫిల్మ్ ఛాంబర్‌కు తాను లేఖ రాసినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాతల కోరిక మేరకు పలు సినిమాలకు టికెట్ల రేట్లు కూడా పెంచామన్నారు.
Latest News