|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 06:16 PM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూనస్ దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నారని, ఉగ్రవాదుల అండతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని సైన్యం కోరడంతో రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో బంగ్లాదేశ్‌లో మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే హసీనా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Latest News