|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 06:12 PM
భారత క్రికెట్ టెస్టు జట్టుకు యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కొత్త కెప్టెన్‌గా ఎంపికవడం తెలిసిందే. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో, అతడి స్థానంలో గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును గిల్ నడిపించనుండగా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని సెలెక్టర్లు శనివారం ప్రకటించారు.ఈ నియామకంపై శుభ్‌మన్ గిల్ తొలిసారిగా స్పందిస్తూ, టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కడం గొప్ప గౌరవమని, అదే సమయంలో ఇదొక పెద్ద బాధ్యత అని అన్నాడు. "చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన ఎవరైనా దేశం కోసం ఆడాలని కలలు కంటారు. కేవలం ఆడటమే కాదు, సుదీర్ఘ కాలం పాటు టెస్టు క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటారు. ఈ అవకాశం రావడం నిజంగా గర్వకారణం, ఇది చాలా పెద్ద బాధ్యత కూడా" అని బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ చిన్న వీడియోలో గిల్ తన సంతోషాన్ని పంచుకున్నాడు.
Latest News