టీటీడీ టౌన్ ప్లానింగ్ విధానం ద్వారా కొత్త పోస్టుల భర్తీ
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 04:17 PM

శ్రీవారి సేవ స్లాట్‌లలో మార్పులు తీసుకొచ్చి, భక్తులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు టీటీడీ కృషి చేస్తుందని టీటీడీ EO శ్యామల రావు అన్నారు. అయన మాట్లాడుతూ.... గ్రూప్ లీడర్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, 50% పాత భక్తులు, 50% కొత్త భక్తులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించబడుతోంది. ఈ విధానం ద్వారా అందరికీ సమాన అవకాశం లభిస్తుందని, ఇది భక్తుల సంతృప్తిని మరింత పెంచుతుందని చెప్పారు . తిరుమలను ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేందుకు టీటీడీ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో 10 కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నిర్మాణాలపై ఆంక్షలు విధించడం ద్వారా, అస్తవ్యస్తమైన అభివృద్ధిని నియంత్రించడం జరుగుతోంది. ఈ చర్యలు తిరుమల సౌందర్యాన్ని, పవిత్రతను కాపాడేందుకు దోహదపడతాయి అని వివరించారు.

Latest News
Tejashwi Yadav accuses NDA of misleading women voters in Bihar with false poll promises Mon, Apr 27, 2026, 02:03 PM
'Why listen to Mamata': Amit Shah refutes Bengal CM's charge of 'paid' supporters Mon, Apr 27, 2026, 02:02 PM
IIT Delhi joins NatWest Group to boost industry‑academia joint research Mon, Apr 27, 2026, 01:58 PM
India tech deals hit $3.9 bn in Q1, highest in nearly 4 years Mon, Apr 27, 2026, 01:56 PM
Serving people of Bengal is in my destiny this time, says PM Modi Mon, Apr 27, 2026, 01:53 PM