వికసిత్ భారత్‌ పై నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 04:15 PM

దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం  కొనసాగుతోంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన గవర్నర్‌లు, సీఎంతో ప్రధాని మాట్లాడారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివేదిక ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించి, ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసిస్తూ నీతి ఆయోగ్ ప్రసంగాన్ని ఏపీ సీఎం ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలను తన ప్రజెంటేషన్‌లో చంద్రబాబు ప్రస్తావించారు. సీఎం ప్రజెంటేషన్‌లో వివిధ అంశాలు వికసిత్ భారత్‌కు ఉపయోగపడేలా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని ప్రధాని సూచించారు.

Latest News
Activist seek global intervention over rising enforced disappearances of Baloch women Mon, Apr 27, 2026, 12:25 PM
BJP supporters hail PM Modi ahead of poll rally in Bengal's Barrackpore Mon, Apr 27, 2026, 12:24 PM
Market cap of S. Korean-listed firms surpasses $4.08 trillion for 1st time Mon, Apr 27, 2026, 12:19 PM
Well at RMP worker's house in Kerala's Nadapuram found contaminated, political motive alleged Mon, Apr 27, 2026, 12:18 PM
Rising food, gas, utility costs squeeze Americans amid tariff, war concerns Mon, Apr 27, 2026, 12:15 PM