![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 02:42 PM
టెస్లా కంపెనీ CFO ' సీఏ వైభవ్ తనేజా' భారీ సంపాదన పొంది వార్తల్లో నిలిచారు. 2024లో ఈయన సంపాదన ఏకంగా 139.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.11.94 వేలకోట్ల కంటే ఎక్కువ). ఇది మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల.. గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్'ల కంటే చాలా ఎక్కువ. 2024లో సుందర్ పిచాయ్ సంపాదన 10.73 మిలియన్ డాలర్లు కాగా, సత్యనాదెళ్ళ సంపాదన 79.106 డాలర్లుగా ఉంది. ఈ సందర్బంగా CA వైభవ్ తనేజా నుThe Institute of Chartered accountants of India,(ICAI) వారు అభినందించారు. చార్టర్డ్ అకౌంటెంట్ గా ఇంతటి ఘన విజయాన్ని సాధించిన 'సీఏ వైభవ్ తనేజా' అత్యున్నత స్థాయిలో నిలవడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Latest News