|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 02:40 PM
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రంగానికి సంబంధించి కొత్త పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి కందుల దు�ర్గేశ్ ప్రక�ించారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం చాలా మంది ఎగ్జిబిటర్లు థియేటర్లను లీజుకు తీసుకొని నడుపుతున్నారని, వారు పర్సంటేజ్ పెంచాలని కోరుతున్నారని ఆయన తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్న మంత్రి, ఈ ఇబ్బందులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని వెల్లడించారు. సినీ పరిశ్రమలో సమస్యలను పరిష్కరించి, అందరికీ న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.