![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 02:34 PM
తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే తారాహై కుత్బర్ట్‌కు ట్రాఫిక్ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. ఇటీవల కున్నియాకుమారి జిల్లాలో నిర్వహించిన ద్విచక్ర వాహనాల ర్యాలీలో ఆమె హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన కారణంగా రూ.1,000 జరిమానా విధించారు.
ఈ ర్యాలీ ఈ నెల 20వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నిర్వహించబడింది. ఇందులో పాల్గొన్న తారాహై కుత్బర్ట్ హెల్మెట్ ధరించకుండా బైక్ తొక్కుతూ కనిపించారు. ఇది ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని ఆమెపై జరిమానా విధించారు.
సాధారణ పౌరులకు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో, ప్రజా ప్రతినిధులకు కూడా అదే విధంగా వర్తిస్తాయని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.