![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 11:07 AM
నేడు కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడనం. 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడి . ఆపై రెండు, మూడు రోజుల్లోనే ఏపీకి విస్తరించే అవకాశం . ఈ ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు.అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్-గోవా తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ శనివారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. ఇది మరింత బలపడేందుకు గాలులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఇతర పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. రాబోయే రోజుల్లో తుపానుగా బలపడే అవకాశం లేకపోలేదు. దీని ప్రభావంతో పశ్చిమ తీరంలో గుజరాత్, గోవా రాష్ట్రాల్లో ఆదివారం వరకు.. కర్ణాటకలో ఈనెల 27 వరకు, మహారాష్ట్రలో ఈనెల 25న, తమిళనాడులో 25, 26 తేదీల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.
Latest News