![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 10:28 AM
మయన్మార్ తీరంలో చోటుచేసుకున్న వరుస పడవ ప్రమాదాల్లో 427 మంది రోహింగ్యా ముస్లింలు మృతి చెందారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ శుక్రవారం తెలిపింది. ఈ నెల 9న 267 మందితో వెళ్తున్న బోట్ మునిగిపోగా 201 మంది, తర్వాతి రోజు 247 మందితో వెళ్తున్న మరో పడవ ప్రమాదానికి గురికాగా 226 మంది మరణించారు. 87 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 2024లో మయన్మార్ తీరంలో మొత్తం 657 మంది మరణించినట్లు UNHCR తెలిపింది.
Latest News