![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 06:54 PM
సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో భారత్‌కు పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ గతంలో ఉపయోగించిన పదజాలాన్నే ఆయన పునరుద్ఘాటించడం గమనార్హం. ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పాకిస్థాన్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో మాట్లాడుతూ, "మీరు మా నీటిని అడ్డుకుంటే, మేము మీ ఊపిరిని అడ్డుకుంటాం" అని చౌదరి భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు సమాచారం. 2008 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కూడా గతంలో ఇదే తరహా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News