![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 06:52 PM
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు జరిపిన ఓ భారీ ఎన్‌కౌంటర్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. అయితే, ఈ ఆపరేషన్ అనంతరం ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల వద్ద డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బలగాలు సంబరాలు చేసుకున్న వీడియో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్ మఢ్ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన తీవ్రస్థాయి ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మరణించారు. మరణించిన వారిలో మావోయిస్టు పార్టీ సుప్రీం నాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నాడు. ఈ ఆపరేషన్‌ను డీఆర్జీ బలగాలు విజయవంతంగా నిర్వహించాయి.అయితే, ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాత, హతమైన మావోయిస్టుల మృతదేహాలను ఒకచోట ఉంచినప్పుడు, డీఆర్జీ సిబ్బంది ఆ మృతదేహాల వద్ద నిలబడి ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. తుపాకులను గాల్లోకి ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
Latest News