తిరుమల భక్తులకి శుభవార్త
 

by Suryaa Desk | Fri, May 23, 2025, 06:51 PM

టీటీడీ భక్తులతో నేరుగా మాట్లాడేందుకు మరోమారు వేదికను సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తమ అభిప్రాయాలను, సలహాలను, సమస్యలను నేరుగా టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన 'డ‌య‌ల్ యువ‌ర్ ఈవో' కార్యక్రమం మే 24, 2025న జరగనుంది.ఈ కార్యక్రమం మే 24వ తేదీ, శనివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహిస్తారు. టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని, భక్తుల నుండి ఫోన్ ద్వారా అందే సూచనలను, అభిప్రాయాలను స్వీకరిస్తారు. టీటీడీ సేవలు, యాత్రికుల సౌకర్యాలు, ఇతర నిర్వహణాపరమైన అంశాలపై భక్తులు తమ అమూల్యమైన సలహాలను ఈవోకు నేరుగా తెలియజేయవచ్చు.ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తులు 0877-2263261 అనే టెలిఫోన్ నంబర్‌కు డయల్ చేసి తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఈ 'డ‌య‌ల్ యువ‌ర్ ఈవో' కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు, తమ సూచనలను తెలియజేసేందుకు వీలు కలుగుతుందని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Latest News
Six civilians forcibly disappeared by Pakistani forces: Rights body Mon, Apr 13, 2026, 02:45 PM
Iranian information operation exposed in Ireland: Mon, Apr 13, 2026, 02:35 PM
Iranian embassy slams Trump for calling Pope Leo XIV 'weak' Mon, Apr 13, 2026, 02:29 PM
Preparations are underway for return of F1 to India: Sports Min Mandaviya Mon, Apr 13, 2026, 02:25 PM
BJD names Manas Ranjan Mangaraj as new party leader in Rajya Sabha Mon, Apr 13, 2026, 02:19 PM