విశాఖ స్టీల్ ప్లాంట్‌ భారీ అగ్నిప్రమాదం
 

by Suryaa Desk | Fri, May 23, 2025, 01:23 PM

విశాఖ స్టీల్ ప్లాంట్‌ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్ఎంఎస్-2 లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో కార్మికులు విధుల్లో లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. అగ్నిప్రమాదం తెల్లవారుజామున జరగడంతో కార్మికులు విధులకు హాజరు కాలేదు.అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై స్టీల్ ప్లాంట్ అధికారులు ఇంతవరకూ స్పందించలేదు. ఆస్తి నష్టం ఏ మేర జరిగిందనే విషయాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు అంచనా వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్-2లో ద్రవపు ఉక్కు ప్రమాదాలు జరుగుతుంటాయని కార్మికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఒకవైపు కార్మికులు చేస్తున్న దీక్ష.. మరోవైపు ఈ ప్రమాదం జరగడం.. సమయానికి కార్మికులు విధులకు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు.

Latest News
'Hindi imposition in disguise': Stalin slams Centre over 'Three-Language Policy' Sat, Apr 04, 2026, 01:05 PM
IPL 2026: RCB skipper Rajat Patidar, Jitesh Sharma visit Tirumala temple ahead of CSK clash Sat, Apr 04, 2026, 12:54 PM
Pakistan fuel price hike sparks Oppn protests, calls to oust Shehbaz Sharif govt Sat, Apr 04, 2026, 12:40 PM
Mumbai's Stasya Pandya clinches dual Team medals at Delhi Horse Show 2026 Sat, Apr 04, 2026, 12:30 PM
'Why are you asking me?': Kohli responds to 'overseas player' tag with humour Sat, Apr 04, 2026, 12:09 PM