విజయవాడలో విదేశీయులు, స్వదేశాలకు పంపనున్న పోలీసులు
 

by Suryaa Desk | Fri, May 23, 2025, 01:23 PM

కృష్ణా జిల్లా,పెనమలూరు మండలం కానూరు, తాడిగడపలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్, మయన్మార్‌కు చెందిన 15 మంది యువకులను గుర్తించారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏడుగురు యువకులు ఇటీవల హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో వారందరినీ స్వదేశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదీకాక ఇటీవల శరణార్థులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి అనంతరం రాష్ట్రాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించాలని.. అలాగే ఇతర దేశాలకు చెందిన వారిని గుర్తించి.. స్వదేశాలకు పంపించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. అందులో భాగంగా విదేశీయులను గుర్తించి వారి సమాచారాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపుతున్నారు. అనంతరం వారిని స్వదేశాలకు పంపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Latest News
Pakistan fuel price hike sparks Oppn protests, calls to oust Shehbaz Sharif govt Sat, Apr 04, 2026, 12:40 PM
Mumbai's Stasya Pandya clinches dual Team medals at Delhi Horse Show 2026 Sat, Apr 04, 2026, 12:30 PM
'Why are you asking me?': Kohli responds to 'overseas player' tag with humour Sat, Apr 04, 2026, 12:09 PM
Armed miscreants attack relatives of Bihar Agriculture Minister in Patna Sat, Apr 04, 2026, 12:03 PM
Pakistani forces killed another Baloch student in Balochistan: Rights group Sat, Apr 04, 2026, 11:59 AM