కసిరెడ్డికి సుప్రీంకోర్టులో దక్కని ఊరట
 

by Suryaa Desk | Fri, May 23, 2025, 01:20 PM

మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు (శుక్రవారం) జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కసిరెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. తన కొడుకు అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించడం లేదంటూ కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది.ఈ రెండు పిటిషన్లపై గత సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు దానికి సంబంధించిన తీర్పును వెల్లడించింది. అరెస్ట్ సక్రమమా కాదా అనేదానిపై మెరిట్స్‌లో వెళ్లకుండా ఈ కేసును పూర్తిగా డిస్పోస్ చేస్తున్నామని తీర్పులో పేర్కొంది. మద్యం స్కాంలో సీఆర్పీసీ 160 ప్రకారం హైదరాబాద్‌లో ఉంటున్న తనకు నోటీసులు జారీ చేసే అధికారం ఏపీ సీఐడీకి లేదంటూ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి పంపించామని.. దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపింది. రెగ్యులర్ బెయిల్‌ వంటి విషయాలు హైకోర్టులో చూసుకోవాలని.. ఈ విషయాలను తాము ప్రస్తావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Latest News
HDFC Bank credit-deposit gap widens as loan growth outpaces deposits Sat, Apr 04, 2026, 11:23 AM
India-flagged LPG tanker Green Sanvi crosses Strait of Hormuz, two more in line Sat, Apr 04, 2026, 11:22 AM
Mortal remains of Ujjain student arrive from Canada; CM Mohan Yadav pays tributes Fri, Apr 03, 2026, 12:14 PM
India's fisheries sector draws Rs 39,272 crore investment since 2015, seafood exports double Fri, Apr 03, 2026, 12:09 PM
I want to prove that winning IPL trophy last season was not a one-off, says RCB wicketkeeper Jitesh Fri, Apr 03, 2026, 12:06 PM