జ్యోతి మల్హోత్రా కి నిధులు సమకూర్చిన యూఏఈ కంపెనీ
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 08:02 PM

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణలతో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆమె విలాసవంతమైన జీవనశైలి, విదేశీ పర్యటనలకు నిధులు ఎలా సమకూరాయన్న కోణంలో అధికారులు లోతుగా విచారిస్తున్నారు. తాజాగా, ఆమెకు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.జ్యోతి మల్హోత్రా చేసిన కొన్ని వీడియోలకు యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న 'వెగో' అనే ట్రావెల్ కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 'వెగో' సంస్థకు అంతర్జాతీయ విమాన రవాణా సంఘం గుర్తింపు ఉంది. సింగపూర్, దుబాయ్ వంటి నగరాల్లో ఈ కంపెనీకి కార్యాలయాలున్నాయి. అంతేకాకుండా, పాకిస్థాన్‌లోనూ చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహించడానికి 'వెగో'కు లైసెన్స్ ఉందని సమాచారం.అయితే, ఈ సంస్థ నేరుగా పాకిస్థాన్‌కు నిధులు సమకూర్చినట్లు ఆధారాలు లేకపోయినా, గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా ప్రయాణాలకు స్పాన్సర్‌గా నిలవడంపై అధికారులు దృష్టి సారించారు. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Latest News
'Make in India' booster: Electronics exports rise about 38 pc in April-Nov Sat, Dec 20, 2025, 01:31 PM
Cambodia says Thai army bombs bridge inside Cambodian territory Sat, Dec 20, 2025, 01:28 PM
ISI's Dhaka Cell plots Bangladesh chaos, eyes West Bengal and Northeast India Sat, Dec 20, 2025, 01:26 PM
I got really worried: Hardik's shot hits cameraman, allrounder checks on him after match Sat, Dec 20, 2025, 01:24 PM
Jantar Mantar protest: Delhi court frames charges against Congress leader Alka Lamba Sat, Dec 20, 2025, 01:14 PM