వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం, ఇద్దరు మృతి
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 08:04 PM

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు దౌత్య కార్యాలయ సిబ్బందిని ఓ దుండగుడు కాల్చి చంపడం తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో "ఫ్రీ పాలస్తీనా" అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ఈ దారుణ హత్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ యూదు మ్యూజియం సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మ్యూజియంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది (ఒక పురుషుడు, ఒక మహిళ)పై నిందితుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. నిందితుడిని చికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జ్‌గా గుర్తించారు. ఈ హత్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర పదజాలంతో ఖండించారు. "వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తల హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు, సహోద్యోగులకు మా ప్రగాఢ సానుభూతి. దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలి" అని జైశంకర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. జైశంకర్ పోస్టుకు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సేర్ స్పందిస్తూ, "ధన్యవాదాలు, ప్రియ మిత్రమా!" అని బదులిచ్చారు.

Latest News
BAI to conduct first-ever grassroots para badminton coaches development programme Sat, Dec 20, 2025, 11:41 AM
US court restores Musk's 2018 Tesla pay package boosting his control stake Sat, Dec 20, 2025, 11:39 AM
US launches airstrikes on ISIS targets in Syria in retaliation for deadly attack Sat, Dec 20, 2025, 11:28 AM
A recalibration moment: Rubio's long view of US power Sat, Dec 20, 2025, 11:23 AM
DMK alliance to hold statewide protest on Dec 24 against Centre's rural job scheme overhaul Sat, Dec 20, 2025, 11:21 AM