అమరావతిని అభివృద్ధి పేరుతో ఐదేళ్లు కొనసాగిస్తూనే ఉంటారు
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 08:00 PM

అమరావతిలో నిరంతరం కాంట్రాక్టులు కొనసాగాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నారని జగన్ ఆరోపించారు. "నిరంతరం కాంట్రాక్టులు ఉండాలి, నిరంతరం పనులు జరుగుతూ ఉండాలి, నిరంతరం వాళ్లు బిల్లులు ఇస్తూ ఉండాలి, నిరంతరం వాళ్లు డబ్బులు ఈయనకి ఇస్తూ ఉండాలి. ఇది నిరంతరం జరుగుతూ ఉండాలన్నదే వారి ఆలోచన" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన నూతన సచివాలయం కూడా అన్ని హెచ్‌ఓడీ కార్యాలయాలతో కలిపి 8 లక్షల 58 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఉందని జగన్ పోల్చి చెప్పారు. అంతకంటే చాలా రెట్లు అధిక విస్తీర్ణంలో ఏపీలో సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఆయన అన్నారు. కేవలం అమరావతిని ఇలాగే కొనసాగించాలని, తద్వారా నిరంతరాయంగా కాంట్రాక్టులు పొందుతూ, ఆర్థిక లబ్ధి పొందాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు.

Latest News
Bharatiya Janata Party Candidate Dalim Roy Injured During Bengal Campaign, Condition Stable Tue, Apr 07, 2026, 12:35 PM
Indian women's hockey team set to tour Argentina for four-match series from April 13-17 Tue, Apr 07, 2026, 12:27 PM
World Health Day: Narendra Modi Shares Message, Thanks Health Workers Tue, Apr 07, 2026, 12:26 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 12:24 PM
World Health Day: Stunning Puri Beach Sand Art Honors Frontline Heroes Tue, Apr 07, 2026, 12:23 PM