అర్హత పొందిన యువత ఓటు నమోదు చేసుకోవాలి
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 02:29 PM

18 సంవత్సరాలు నిండిన యువత ఓటు నమోదు చేసుకునేలా చూడాలని పాణ్యం పొలిటికల్‌ పార్టీ ప్రతినిధులకు కర్నూలు జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాలులో పాణ్యం నియోజకవర్గ పొలి టికల్‌ పార్టీ ప్రతినిధులతో జాయింట్‌ కలెక్టర్‌ నవ్య సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు పాణ్యం నియోజక వర్గంలో 1177 డూప్లికేట్‌ ఓట్లను గుర్తించి తొలగించామన్నారు. దాదాపు 500 నూతన ఓటర్లను నమోదు చేశామన్నారు. నియోజక వర్గంలో 1200 ఓట్లు దాటి ఉన్నటువంటి పోలింగ్‌ స్టేషనలను గుర్తించి అదనంగా ఉన్న ఓటర్లను పారం-8 ద్వారా ఒతర పోలింగ్‌ స్టేషన్లను బదిలీ చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం నవంబరు, డిసెంబరు, జనవరి మాసాలలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వివాహం చేసుకుని వెళ్లిన మహిళలు, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, వలసలు వెళ్లినవారు తమ ఓటును బదిలీ చేసుకోవచ్చ న్నారు. పొలిటికల్‌ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ బీఎల్‌వోలు క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లు వెరిఫికేషన జరిపి డూప్లికేట్‌ ఓట్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని ట్రాన్సజెం డర్లను గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించాలని జేసీని కోరారు. కార్యక్రమంలో జనసేన, బీఎస్పీ, బీజేపీ, సీపీఎం పార్టీల నాయకులు మంజునాథ్‌, రామశేషయ్య, నాగరాజు, రామకృష్ణ, ఐఎనపీ ఎస్‌. రజా క్‌వలి, కల్లూరు, పాణ్యం, గడివేముల తహసీల్దార్లు ఆంజనేయులు, నరేంద్రనాథ్‌రెడ్డి, వెంకటరమణ, ఓర్వకల్లు డీటీ రాజేష్‌, ఎలక్షన డీటీ తహసీల్దార్‌ జి.అనూరాధ పాల్గొన్నారు.

Latest News
Violence, mistrust derail anti-polio drive in Pakistan Sat, Apr 18, 2026, 04:09 PM
10 Kannur CPI-M workers get 25-year jail term for hurling bombs at BJP/RSS supporters Sat, Apr 18, 2026, 04:01 PM
CSK must play MS Dhoni, it will give them an extra edge against SRH: Aditya Tare Sat, Apr 18, 2026, 03:59 PM
Gujarat: Six arrested in over Rs 210-crore cyber fraud linked to 273 cases nationwide Sat, Apr 18, 2026, 03:51 PM
ECI plans 'slow polling', 'slow counting' to frustrate TMC agents: Mamata Sat, Apr 18, 2026, 03:50 PM