![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 11:25 AM
JEE అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించి అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ విడుదల చేయనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in ద్వారా తమ రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది మే 18న JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష రెండు షిఫ్టుల్లో జరగ్గా.. మొత్తం 2.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.విద్యార్థుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జూన్ 2న ఆన్‌లైన్ ద్వారా ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 3 నుంచి ఎన్‌ఐటీ, ఐఐటీ ఇతర జాతీయ సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన షెడ్యూల్‌ను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) విడుదల చేస్తుంది.
Latest News