|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 05:04 PM
"ఆపరేషన్ సిందూర్" అనంతరం ఉగ్రవాద నిర్మూలన పట్ల భారత్ దృఢ సంకల్పాన్ని, వైఖరిని అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ దౌత్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కూడిన ప్రతినిధి బృందాలు 33 దేశాల్లో పర్యటించనున్నాయి. ఈ పర్యటనలకు వెళ్లే ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ బృందాలకు ప్రత్యేకంగా పలు అంశాలపై వివరణ ఇచ్చింది. ముఖ్యంగా కాల్పుల విరమణ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్న వార్తలను, చైనా వైఖరిలో వచ్చిన మార్పును ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం.మంగళవారం సంజయ్ ఝా, కనిమొళి, శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని మూడు ప్రతినిధి బృందాలకు విదేశాంగ శాఖ అధికారులు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. మరో నాలుగు బృందాలకు బుధవారం ఇలాంటి సమావేశం జరగనుంది. మొత్తం ఏడు బృందాల్లో మొదటి బృందం బుధవారమే తమ పర్యటనను ప్రారంభించనుంది.
Latest News