|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 05:01 PM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు తనను బదిలీ చేయడం వెనుక తీవ్రమైన వేధింపుల ఉద్దేశం ఉందని జస్టిస్ దుప్పల వెంకట రమణ సంచలన ఆరోపణలు చేశారు. జూన్ 2వ తేదీన పదవీ విరమణ చేయనున్న ఆయన, మంగళవారం మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌లో జరిగిన వీడ్కోలు సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన బదిలీ అన్యాయంగా, దురుద్దేశంతో జరిగిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు."నన్ను వేధించాలనే స్పష్టమైన ఉద్దేశంతో, కొన్ని కారణాల వల్ల నా సొంత రాష్ట్రం నుంచి బదిలీ చేశారు. వారి అహాన్ని సంతృప్తిపరిచినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడు వారు కూడా పదవీ విరమణ చేశారు. దేవుడు ఎవరినీ క్షమించరు, మర్చిపోరు. వారు కూడా మరో రూపంలో బాధపడతారు," అంటూ జస్టిస్ వెంకటరమణ ఘాటుగా వ్యాఖ్యానించారు.
Latest News