|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:34 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. వరుసగా మూడో రోజు కూడా మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్‌ను కొనసాగించాయి. సెన్సెక్స్ 410 పాయింట్ల లాభంతో 81,596 స్థాయిలో ముగించగా, నిఫ్టీ 129.55 పాయింట్లు ఎగిసి 24,813.45 వద్ద స్థిరమైంది.
సెక్టార్‌ల వారీగా పరిశీలిస్తే, నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, సిప్లా, టాటా స్టీల్, HDFC లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. JSW స్టీల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మారక విలువల్లో రూపాయి స్వల్పంగా బలహీనపడింది. డాలర్‌తో మారకంలో రూపాయి విలువ రూ.85.59గా నమోదైంది.