|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:37 PM
అనంతపురం జిల్లా గుడిబండ మండలం పిఎన్ పాలెం గ్రామంలో నిర్వహించిన శుభకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సిద్దేసప్ప నివాసానికి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ని ఘనంగా సత్కరించారు.
శుభకార్యానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామికి గ్రామస్తులు ప్రత్యేక ఆహ్వానం అందించి, హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోళ్ల మండలానికి వెళ్లి అక్కడ నిర్వహించిన మరొక శుభకార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ పర్యటన సందర్భంగా ఆయన పలువురితో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ, స్థానిక సమస్యల గురించి ఆరాతీశారు. ఆయన పర్యటనకు గ్రామస్తులు ఉత్సాహంగా స్పందించారు.