కొండచరియలు విరిగిపడడంతో మార్గంలో చిక్కుకుపోయిన మానస సరోవర్ యాత్రీకులు
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 04:34 PM

కైలాస మానస సరోవర్ యాత్రీకులు మార్గమధ్యలో చిక్కుకుపోయారు. యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు బ్లాక్ అయిందని, యాత్రీకులు ముందుకు వెళ్లే పరిస్థితి లేదని అధికారులు తెలిపారు. దాదాపు 180 మంది యాత్రీకులు చిక్కుకుపోయారని చెప్పారు. అయితే, ఈ ఘటనలో యాత్రీకులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. సమాచారం అందుకున్న బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్డును క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్లపై పడిపోయిన శిథిలాలను తొలగిస్తున్నట్లు చెప్పారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోరాగఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2020లో కరోనా  మహమ్మారి కారణంగా కైలాస మానస సరోవర్ యాత్రను అధికారులు నిలిపివేశారు. కరోనా తగ్గినప్పటికీ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ యాత్రను పునరుద్ధరించలేదు. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల ఫలితంగా మానస సరోవర్ యాత్రను ఐదేళ్ల తర్వాత ఈ ఏడాదే తిరిగి ప్రారంభించారు.

Latest News
South Korea and Australia agree to enhance cooperation on stable energy supplies Thu, Apr 30, 2026, 04:38 PM
Delhi High Court grants interim relief to Karisma Kapoor's children, restrains widow in estate dispute Thu, Apr 30, 2026, 04:37 PM
Invest India facilitates 60 FDI projects worth $6.1 billion in FY26, creates over 31,000 jobs Thu, Apr 30, 2026, 04:34 PM
India Post Payments Bank's SHG savings account to boost financial inclusion Thu, Apr 30, 2026, 04:31 PM
Russia has no 'aggressive intentions' towards Europe: Medvedev Thu, Apr 30, 2026, 04:26 PM