|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:30 PM
గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలంలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె. సురేష్ తన భార్య కుసుమపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
సురేష్ తనకు పరిచయమైన ధనలక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యవహారాన్ని భార్య కుసుమ ప్రశ్నించడంతో, సురేష్ గత ఆరు నెలలుగా ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు.
తన భార్య అడ్డు తొలిగించుకోవాలని భావించిన సురేష్, ఈ నెల 18వ తేదీన తన ప్రేయసి ధనలక్ష్మితో కలిసి కుతంత్రానికి పాల్పడ్డాడు. ముందుగా భార్య కళ్లలో కారం నూరి, ఆమెను అంధంగా చేయాలని యత్నించాడు. అనంతరం ఆమె గొంతులో ట్యాబ్లెట్ల పొడి వేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు.
తదుపరి భార్య కుసుమ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.