|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:05 PM
కదిరిలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ హాజరయ్యారు. ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి సభను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, భావి ఎన్నికల కోసం గట్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
త్వరలో కడపలో జరగనున్న మహానాడుకు నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పార్టీ శక్తిని ప్రదర్శించాలని ఆయన కోరారు. కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా హాజరై విజయవంతం చేశారు.