|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:05 PM
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ యువ క్రికెటర్లతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి పలు విలువైన సలహాలు, సూచనలు అందజేశారు.యువ ఆటగాళ్లను ఉద్దేశించి ధోనీ మాట్లాడుతూ, "మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురికావొద్దు. సీనియర్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది నుంచి నేర్చుకోండి. యువ ఆటగాళ్లు 200 ప్లస్ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయాలనుకున్నప్పుడు, బ్యాటింగ్‌లో నిలకడ కొనసాగించడం కష్టమే. అయినా మ్యాచ్‌లో ఏ దశలో అయినా సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం వారి సొంతం" అని అన్నారు. అంచనాల భారాన్ని మోయకుండా సహజసిద్ధమైన ఆటతీరును ప్రదర్శించాలని యువకులకు సూచించారు.
Latest News