|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:02 PM
పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)కు చెందిన విద్యార్థిని N. అక్షయ ప్రతిభను ప్రభుత్వం గుర్తించి గౌరవించింది. పదవ తరగతి పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన అక్షయ, మొత్తం 600 మార్కులకు గాను 587 మార్కులు సాధించి “షైనింగ్ స్టార్ గోల్డ్ మెడల్ అవార్డు”కు ఎంపికైంది.
ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా అక్షయ స్వీకరించింది. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు గంగమ్మ, మల్లికార్జున గార్లు సంతోషం వ్యక్తం చేయగా, కేజీబీవీ ఉపాధ్యాయులు, సిబ్బంది గర్వంతో స్పందించారు.
పేద కుటుంబ పట్టనుంచి వచ్చినప్పటికీ, అక్షయ కష్టపడి చదువుకొని ఈ ఘనతను సాధించింది. ఇది ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్ధిని భవిష్యత్తులో మరిన్ని ఉన్నతులు సాధించాలని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు.