|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:08 PM
కాకినాడ జిల్లా, మయ్యవరం మండలంలోని ఉప్పాడ పంచాయతీ నాయకర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం మూడు మంది మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అయితే హోప్ ఐలాండ్ సమీపంలో రాకాసి కెరటాలు పడవను తాకి బోల్తా పడేలా చేశాయి.
ఈ ప్రమాదంలో ముగ్గురిలో ఒకరైన మేరుగు శ్యామ్ (వయసు 20) గల్లంతయ్యాడు. మరో ఇద్దరు మత్స్యకారులు ఈదుకుంటూ బయటపడగలిగారు. గల్లంతైన శ్యామ్ ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడంతో, అతడి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తీరాన శోకసంద్రంలో కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రస్తుతం శ్యామ్ కోసం స్థానిక రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన తీర ప్రాంత వాసుల్లో ఆందోళనకు గురిచేసింది.