|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 02:06 PM
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో నేరానికి పాల్పడటమే కాకుండా వారు రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపించింది. బుధవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలో భాగంగా ఈడీ ఈ వాదన వినిపించింది. కాగా ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే.ఇందులోభాగంగా నోటీసులు జారీ చేసింది. ఆయా ఆస్తుల్లో ఉన్నవారు ఖాళీ చేయాలని పేర్కొంది. అద్దెకు ఉంటున్నవారు ఇకపై తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని తెలిపింది. అక్రమ చెలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ (8) నిబంధన 5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకొనే ప్రక్రియ చేస్తున్నామని తెలిపింది. ఆస్తులు ఉన్న ప్రాంతాల్లో (దిల్లీ, ముంబయి, లఖ్‌నవూ) భవనాలకు నోటీసులు అంటించినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
Latest News