|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 02:33 PM
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వమని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేషన్ వాహనాలను రద్దు చేయడం సరికాదని హితువు పలికారు. జగన్ పాలనలో మద్యం కుంభకోణం జరగలేదని స్పష్టం చేశారు. కట్టుకథలతో మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.కాగా, ఏపీ ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మంగళవారం రోజు సంచలన వ్యాఖ్యలుచేసిన విషయం విదితమే.. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూనే అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.. ఇప్పుడు ఉన్న అధికారులు అన్యాయమైన పనులు చేస్తే.. రేపు మళ్లీ మన రోజు వస్తుంది.. ఇప్పుడు పేర్లు రాసిపెట్టుకొంది.. రిటైర్డ్ అయినా.. విదేశాలకు పారిపోయినా.. తీసుకొచ్చిన సినిమా చూపిస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Latest News